Share News

ప్రజలకు సంతృప్తికర సేవలందించాలి

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:59 PM

: ప్రజలకు సంతృప్తికర సేవలను అందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు.

ప్రజలకు సంతృప్తికర సేవలందించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సంతృప్తికర సేవలను అందించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కోరారు. కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలను అమలు చేయడం, ప్రణాళికలను రూపొం దించడం, పథకాలు లబ్ధిదారులకు చేరేలా చూడాల్సిన బాధ్యత ఉద్యోగుల దేనన్నారు. నిబంధనలకు అనుగుణంగా ప్రజలతో స్నేహంగా ఉండాలని, తోటి ఉద్యోగులను గౌరవిస్తూ లక్ష్యాలను సాధించాలన్నారు. విధి నిర్వహణలో నిజాయతీగా పనిచేస్తే గుర్తింపు ఉంటుంద న్నారు. కార్యక్ర మంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఎస్‌డీపీ పద్మావతి, కలెక్టరేట్‌ ఏవో జీఏ సూర్యనారాయణ, సెక్షన్‌ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌, జేసీలకు అభినందన

పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగ స్వాములు కావాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. జాతీయ పౌరసేవల దినోత్సవం సందర్భంగా లయన్స్‌ క్లబ్‌, శ్రీకాకుళం సెంట్రల్‌ ప్రతినిధులు మంగళ వారం కలెక్టర్‌, జేసీలను మర్యాద పూర్వకంగా కలిసి శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్‌ జైలు ఖైదీలు తయారు చేసిన గుడ్డ సంచులను పరిశీలించి, శ్రీకాకుళంలో వాటి తయారీకి గల అవకా శాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు నటుకుల మోహన్‌, పొన్నాడ రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 11:59 PM