తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలి
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:17 AM
నాణ్యమైన మందులను తక్కువ ధరలకే ప్రజలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు డిమాండ్‌చేశారు.
అరసవల్లి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): నాణ్యమైన మందులను తక్కువ ధరలకే ప్రజలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్స్ యూనియన్ నాయకులు డిమాండ్‌చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వారు శుక్రవారం నగరంలోని డే,నైట్ జంక్షన్ వద్ద అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మందులపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని, మందుల తయారీ ఖర్చు ఆధారంగా ధరలను నిర్ణయించాలన్నారు. నకిలీ, నాసికరం మందుల తయారీదారు లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేష్, కార్యదర్శి వాసు, నాయకులు రామాచారి, శ్రీకాంత్, సంపత్‌కుమార్, జగదీష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.