సాగునీటిని అందించండి
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:38 PM
: నారాయణపురం కుడి కాలువ ద్వారా శివారు భూములకు చుక్క నీరు అందక ఎదలు ఎండిపోతున్నా యని, వెంటనే సాగునీటిని అందించాలని తమ్మినాయుడుపేట పంచా యతీ సనపలవానిపేట రైతులు కోరారు.
- లేదంటే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
- సనపలవానిపేట రైతుల నిరసన
ఎచ్చెర్ల, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): నారాయణపురం కుడి కాలువ ద్వారా శివారు భూములకు చుక్క నీరు అందక ఎదలు ఎండిపోతున్నా యని, వెంటనే సాగునీటిని అందించాలని తమ్మినాయుడుపేట పంచా యతీ సనపలవానిపేట రైతులు కోరారు. సోమవారం నారాయణ పురం కాలువ వద్ద నిరసన చేపట్టారు. సమీప గ్రామాల్లో కొందరు రైతులు కాలువకు అడ్డంగా పూన్లు (గట్లు) వేసి నీటిని దారి మళ్లిస్తు న్నారని, దీంతో ఆయకట్టు చివరి భూములకు నీరు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా బెండివానిపేట, సనపలవాని పేట, తమ్మినాయుడుపేట గ్రామాలకు చెందిన సుమారు 200 ఎకరాల ఆయకట్టు తీవ్ర సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. కళ్లె దుట పంట ఎండిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని వాపో యారు. వెంటనే అధికారులు స్పందించి సాగునీరు సక్రమంగా అం దేలా చర్యలు చేపట్టాలని, లేదంటే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడి స్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు సనపల హరి, ససపల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.