Share News

ఇళ్ల స్థలాలు ఇప్పించండి

ABN , Publish Date - May 16 , 2026 | 12:05 AM

మూడు దశా బ్దాల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కట్టు కునేందుకు స్థలాలను కేటాయించిందని, అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇళ్ల నిర్మాణం చేపట్ట లేకపోయామని పలువురు లబ్ధిదారులు పేర్కొ న్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు మాకు కేటాయించిన స్థలాలకు అధికారులు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి వేరొక వ్యక్తికి చెందిన జిరాయితీగా చూపించి అన్యాయం చేశా రని వారు ఆవేదన వ్యక్తంచేశారు.

ఇళ్ల స్థలాలు ఇప్పించండి
ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు, గ్రామస్థులు

కేసరిపడలో లబ్ధిదారుల వేడుకోలు

కంచిలి, మే 15 (ఆంధ్రజ్యోతి): మూడు దశా బ్దాల కిందట అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కట్టు కునేందుకు స్థలాలను కేటాయించిందని, అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇళ్ల నిర్మాణం చేపట్ట లేకపోయామని పలువురు లబ్ధిదారులు పేర్కొ న్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు మాకు కేటాయించిన స్థలాలకు అధికారులు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి వేరొక వ్యక్తికి చెందిన జిరాయితీగా చూపించి అన్యాయం చేశా రని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం సదరు ప్రదేశం వద్ద లబ్ధిదారులు కేసరిపడ గ్రామానికి చెందిన మాలి మోహిని మహాపాత్రో, పిలక గంగమ్మ, సల్ల గంగమ్మ తదితరు లు విలేక రుల ఎదుట తమ గోడును విన్నవించు కున్నారు. సమస్యను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ నియోజకవర్గానికి వచ్చినపుడు విన్నవించామని, వారు కలెక్టర్‌కు సిఫారసు చేసి న్యాయం చేయా లని ఆదేశించినప్పటికీ నేటికీ న్యాయం జరగ లేదన్నారు. నిరుపేదలమైన మాకు ఇచ్చిన స్థలాల ను ఇతరులకు కేటాయించడం ఏమి టని కన్నీళ్ల పర్యంత మయ్యారు. దీనిపై గ్రామానికి చెందిన మల్లార్పు దుదిష్టి, కడియం ప్రసాద్‌, కొరికాన కృష్ణమూర్తి, చంద్రమణి, గంగాధర్‌, గోపాల్‌, అజిత్‌, గోవింద తదితరులు మాట్లాడుతూ.. బాధితులకు ఏసీడీపీ పథకం కింద అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేసిన మాట వాస్తవమన్నారు. దానికి సంబంధించిన పట్టాలతో పాటు వైసీపీ ప్రభుత్వంలో ఒకొక్కరూ రూ.10 వేల వంతున చెల్లించి ఇళ్ల శాశ్వత ధ్రువీకరణ పత్రాలు సైతం పొందా రన్నారు. మండల స్థాయిలో అధికారుల తప్పుడు నివేదికలతో నిరుపేదలకు అన్యాయం జరిగిందని, ఉన్నతాధి కారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

Updated Date - May 16 , 2026 | 12:05 AM