Share News

మెరుగైన వైద్యం అందించండి

ABN , Publish Date - Apr 14 , 2026 | 11:52 PM

: ఫరీదుపేట సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమా దంలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రజ్యోతి సబ్‌ ఎడిటర్‌ తాడి రాజేష్‌ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

మెరుగైన వైద్యం అందించండి
రాజేష్‌ను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌ సతీమణి స్వాతి

మెడికవర్‌ ఆసుపత్రి యాజమాన్యానికి మంత్రుల ఆదేశం

గాయపడిన ‘ఆంధ్రజ్యోతి’ సబ్‌ ఎడిటర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా

శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఫరీదుపేట సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమా దంలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రజ్యోతి సబ్‌ ఎడిటర్‌ తాడి రాజేష్‌ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఎచ్చెర్ల యూనిట్‌ కార్యాలయంలో విధులు ముగించుకుని వస్తు న్న వారిని కారు ఢీకొన్న సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న మం త్రులు మెడికవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్‌ పరిస్థితిపై సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానందకు రామ్మోహన్‌నాయుడు ఫోన్‌లో ఆదేశించారు. రాజేష్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇదే ప్రమా దంలో గాయపడిన మరో సబ్‌ ఎడిటర్‌ పైల మదన్‌మోహన్‌ ఆరోగ్యం కుదుట పడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ సతీమణి స్వాతీశంకర్‌ స్వయంగా మెడికవర్‌ ఆసుపత్రికి వెళ్లి ఐసీయూలో చికిత్స పొందుతున్న రాజేష్‌ను పరామర్శించారు. రాజేష్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు.

Updated Date - Apr 14 , 2026 | 11:52 PM