మెరుగైన సేవలు అందించండి: డీఎంహెచ్వో
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:01 AM
హెచ్ఐవీ భాదితులకు మెరుగైన వైద్యసేవలు, సంరక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో డా.ఈవీ నరేష్కుమార్ అన్నారు.
శ్రీకాకళం కల్చరల్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): హెచ్ఐవీ భాదితులకు మెరుగైన వైద్యసేవలు, సంరక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో డా.ఈవీ నరేష్కుమార్ అన్నారు. బుధవారం డీఎం హెచ్వో కార్యాలయంలో జిల్లా కమ్యానిటీ రిసోర్స్ గ్రూప్ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఐవీ నివారణపై సమాజంలో విస్తృత అవగాహన కలిగించాలని, బాధితులకు ఏఆర్టీ సేవ లు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణాధికారి డా.టి.శ్రీకాంత్, రాష్ట్ర సీఆర్జీ సభ్యురాలు సుధారాణి, శ్రీకాకుళం ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారి డా.చక్రవర్తి పాల్గొన్నారు.