రోగులకు మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:36 PM
రోగులకు మెరుగైన సేవలందించాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. బుడితి సీహెచ్‌సీ అభివృద్ధికి సహక రిస్తానని తెలిపారు.
జలుమూరు, (సారవకోట) ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన సేవలందించాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. బుడితి సీహెచ్‌సీ అభివృద్ధికి సహక రిస్తానని తెలిపారు. స్థానిక సామాజిక ఆసుపత్రి ఆవరణలో రూ.18 లక్షలతో ప్రహరీ నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సంద ర్భంగా ఆసుపత్రి పరిసరాలు, రోగులు వార్డులు పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని కోరారు. పోస్టుమార్టం షెడ్ నిర్మాణం, జనరేటరు, ప్రస్తుతం ఉన్న 30 పడకలున్న విభాగాన్ని 50 పడకలకు విస్తరించడం వంటి అభివృద్ధి పనులపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి అనస్తీషియన్ నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ చల్ల చైతన్య, కమిటీ సభ్యులు అక్కాజోష్యుల దత్తుబాబు, పొన్నాన రామకృష్ణ, గొల్లంగి మోహనరావు, సర్పంచ్ పొన్నాన శంకరరావు పాల్గొన్నారు.