Share News

మెరుగైన వైద్య సేవలందించండి

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:44 PM

వైద్య ఆరోగ్యశాఖ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు డీఎంహెచ్‌వో నరేష్‌కుమార్‌కు కోరారు.

  మెరుగైన వైద్య సేవలందించండి
మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు:

శ్రీకాకుళం కల్చరల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు డీఎంహెచ్‌వో నరేష్‌కుమార్‌కు కోరారు. పాలనను మెరు గుపరిచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించా లని ఆదేశించారు. డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరిం చిన తర్వాత తొలిసారిగా శనివారం మంత్రి అచ్చెన్నా యుడిని నరేష్‌కుమార్‌ నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పలువిషయాలను చర్చించారు. జిల్లా కార్యాలయ పని తీరును సమీక్షించి అవసరమైన మార్పులు చేపట్టాలని కోరారు. ఆయన వెంట రవిప్రసాద్‌, రవీంద్ర, ప్రదీప్‌, సాల్మన్‌రాజు ఉన్నారు.

ఈ-ఆఫీస్‌ సమర్ధంగా నిర్వహించాలి

అన్ని పీహెచ్‌సీలు ఈ-ఆఫీస్‌ను సమర్ధంగా నిర్వహించాలని డీఎంహెచ్‌వో నరేష్‌ కుమార్‌ ఆదేశించారు.శ్రీకాకుళంలోని జిల్లా వైద్యఆరోగ్యశాధికార్యాలయంలో జూనియర్‌, సీనియర్‌అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పీహెచ్‌సీ వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంలో ప్రతి ఉద్యోగి అటెండెన్సు ప్రతిరోజూ నిర్ణీత వేళల్లో వేయాలని కోరారు. సమావేశంలో డీపీఎంవో బి.రవీంద్ర ఎన్‌హెచ్‌ఎంఏఓ సాల్మన్‌రాజు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు:

Updated Date - Aug 29 , 2026 | 11:44 PM