Share News

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

ABN , Publish Date - May 30 , 2026 | 11:49 PM

టెక్కలి ఎన్టీఆర్‌ కాలనీలో తాగునీటి ఎద్దడిని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో మహిళలు శనివారం నిరసన తెలి పారు.

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన
టెక్కలిలో ఖాళీబిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు:

టెక్కలి, మే 30(ఆంధ్రజ్యోతి): టెక్కలి ఎన్టీఆర్‌ కాలనీలో తాగునీటి ఎద్దడిని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో మహిళలు శనివారం నిరసన తెలి పారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ కాలనీలో మూడురోజులుగా పైపులు మరమ్మతుల పేరిట నీరు నిలిపివేశారని, కుళాయి పైపులు ద్వారా నాచు రంగు నీరు కొన్నిచోట్ల వస్తోందని తెలిపారు. సీపీఎం నాయకులు కొల్లి ఎల్లయ్య, నంబూరు షణ్ముఖరావు, హనుమంతు ఈశ్వరరావు మాట్లాడుతూ పాలకులు తాగు నీటి ఇక్కట్లు తీరుస్తామని హామీలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో విఫలమ వుతున్నారని ఆరోపించారు.

Updated Date - May 30 , 2026 | 11:49 PM