అలుదులో బస్సులు ఆపాలని నిరసన
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:10 AM
సారవకోట మండలంలోని అలుదులోగల ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాపు వద్ద బస్సులు ఆపాలని గ్రామస్థులు రోడ్డుపై నిరసన తెలిపి శనివారం వాహనాలు రాకపోకలను అడ్డుకున్నారు.
జలుమూరు (సారవకోట) మార్చి 14 (ఆంధ్రజ్యోతి): సారవకోట మండలంలోని అలుదులోగల ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాపు వద్ద బస్సులు ఆపాలని గ్రామస్థులు రోడ్డుపై నిరసన తెలిపి శనివారం వాహనాలు రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోవడంతో సారవకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ డీఎం అలుదులో గల రిక్వెస్టు స్టాపు వద్ద ఇక బస్సులు ఆపుతామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు నిరసన కార్యక్రమం విరమించారు.