సమస్యలు పరిష్కరించాలని నిరసన
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:36 PM
స్యల ను పరిష్కరించాలని కోరు తూ కాంట్రాక్ట్ వైద్య సిబ్బం ది గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
శ్రీకాకుళం కల్చరల్/ ఇచ్ఛాపురం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): సమస్యల ను పరిష్కరించాలని కోరు తూ కాంట్రాక్ట్ వైద్య సిబ్బం ది గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. శ్రీకాకుళం రిమ్స్, ఇచ్ఛా పురం ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన తెలిపారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపి నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి వైద్య ఆరోగ్య శాఖలో సేవందిస్తున్న తమ సేవలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్‌గా చేస్తామన్న హామీని అమ లుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్‌పర్సన్ వేద లక్ష్మీబాయి, కన్వీనర్ ఆర్.రఘు, సమన్వయ కర్త వెంకటరమణ, ఎం.జగదీశ్వరి, ఎన్.జగదీశ్వరి, ఎన్.జయలక్ష్మి, షమీనా ఎండీ, తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛా పురంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ పాతిర్ల దేవేంద్రరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.