ఇందిరానగర్‌లో తాగునీటి కోసం నిరసన
ABN , Publish Date - Mar 24 , 2026 | 11:59 PM
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో గల ఇందిరానగర్ వాసులు పైపులైన్ నుంచి తాగునీరు రాకపో వడంతో మంగళవారం నిరసన తెలిపారు.
కాశీబుగ్గ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో గల ఇందిరానగర్ వాసులు పైపులైన్ నుంచి తాగునీరు రాకపో వడంతో మంగళవారం నిరసన తెలిపారు. ఈ మేరకు కాళీ బిందెలతో రోడ్డు బైఠాయించారు. దీంతో మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసులకు సమాచారం తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని మహిళలతో మాట్లాడారు. వెంటనే వార్డుకు ట్యాంకర్‌తో నీటిని సరఫరాచేశారు.