కనీస వేతనం అమలు చేయాలని ధర్నా
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:40 AM
కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్య క్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా కన్వీనర్ కె.నాగమణి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 30(ఆంధ్రజ్యోతి): కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్య క్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా కన్వీనర్ కె.నాగమణి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. తొలుత ఆర్‌బీ బంగ్లా రోడ్డులో సమావేశం అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధర్నా కు వస్తున్న కార్మికులను పలాస, మందస తదితర ప్రాంతాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవ డాన్ని తీవ్రంగా ఖండిం చారు. ప్రజాస్వామ్యయుతంగా చేసే పోరాటాలపై ప్రభుత్వం పోలీసు నిర్బంధం ప్రయోగించడం హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. 2007 నుంచి షెడ్యూల్ పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభు త్వం కనీస వేతనాలు సవరించలేదని, దీంతో 50 లక్షల మంది కార్మికులు నష్ట పోతున్నారన్నారు. ఆప్కాస్‌లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అందరికీ హెచ్‌ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ధర్నాకు పలు సంఘాల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు మహాలక్ష్మి, అల్లు సత్యనారా యణ, ఎం.ఆది నారాయణమూర్తి, ఈశ్వరరావు, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.