Share News

బస్సులు ఆపకపోవడంపై నిరసన

ABN , Publish Date - Feb 28 , 2026 | 11:53 PM

కళాశాలల సమయా ల్లో బస్సులను ఆపడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

బస్సులు ఆపకపోవడంపై నిరసన
ఎస్‌ఐతో మాట్లాడుతున్న విద్యార్థులు

అలికాం-బత్తిలి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు

ట్రాఫిక్‌కు అంతరాయం

ఆమదాలవలస, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కళాశాలల సమయా ల్లో బస్సులను ఆపడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం దన్నాన పేట గ్రామం వద్ద ప్రభుత్వ పాలిటెక్నిక్‌ విద్యా ర్థులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేప థ్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోవ డంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలి గింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు విపరీత మైన రద్దీతో వస్తుండడంతో డ్రైవర్లు స్టేజీల వద్ద నిలపకుండా వెళ్లిపోతున్నారని వాపోయారు. దీంతో సకాలంలో కళాశాలలకు, ఇళ్లకు చేరుకోలే కపోతున్నామన్నారు. కళాశాల ముగిసిన తర్వా త హిరమండలం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు, శ్రీకాకుళం నుంచి హిరమండలం వైపు వెళ్లే బస్సులు కళాశాల స్టేజీ వద్ద ఆగకపోవ డంతో ప్రైవేటు ఆటోలు, ఇతర వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. తక్షణం ఆర్టీసీ అధికారులు స్పందించాలని విద్యార్థులు డిమాం డ్‌ చేశారు. ట్రాఫిక్‌ అంతరాయం విషయం తెలుసుకున్న ఎస్‌ఐ బాలరాజు సిబ్బందితో అక్క డికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Updated Date - Feb 28 , 2026 | 11:53 PM