‘చట్టాలపై అవగాహనతో రక్షణ’
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:49 PM
న్యాయవ్యవస్ధ, చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల మహిళలకు మరింత రక్షణ ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి హరిబాబు అన్నారు.
నరసన్నపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్ధ, చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల మహిళలకు మరింత రక్షణ ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి హరిబాబు అన్నారు. మంగళవారం వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళ రక్షణ చట్టాలను తెలుసుకోవడం ద్వారా హక్కులను వినియోగించుకోవడంతో పాటు బాధ్యతలను మరింత చక్కగా నిర్వహించేందుకు దోహదపడతాయన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు, పోక్సో చట్టం, వరకట్న వేధింపులు తదితర అంశాలపై ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ కోర్టు న్యాయాధికారి వాణి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, తహసీల్దా ఆర్.సత్యనారాయణ, ఎస్‌ఐ గణేష్, విజయానంద్, గౌరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్‌జైల్‌ను పరిశీలించారు.