Share News

చట్టాలపై అవగాహనతోనే రక్షణ

ABN , Publish Date - Nov 03 , 2026 | 12:04 AM

చట్టాలపై పూర్తి అవగాహనతోనే మహిళలకు రక్షణ ఏర్పడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

చట్టాలపై అవగాహనతోనే రక్షణ
మాట్లాడుతున్న న్యాయాధికారి హరిబాబు

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): చట్టాలపై పూర్తి అవగాహనతోనే మహిళలకు రక్షణ ఏర్పడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా కళాశాల లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైంగికంగా ఎవరైనా వేధిస్తే భయ పడకుండా తల్లి దండ్రులకుు లేదా పోలీసులకు ధైర్యంగా చెప్పాలన్నారు. అలాగే బాల్య వివాహ నిషేధిత చట్టం, విద్యా హక్కు, బాల కార్మిక నిషేధిత చట్టాలపై వివరించారు. ఏ విధమైన న్యాయసహాయం కావాలన్నా టోల్‌ ఫ్రీ నంబరు 15100 లేదా పోలీసు సహాయం కోసం 100, మహిళా హెల్ప్‌ లైన్‌ 181 కి కూడా కాల్‌ చేయవచ్చన్నారు. అపరి చితులతో పరిచయం పెంచుకుంటే అది ఎప్పటికైనా ప్రమాదాలను తెచ్చిపెడుతుందని హెచ్చరించారు. కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవ న్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, అధ్యాపకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2026 | 12:04 AM