గిరిజనుల భూములను పరిరక్షించండి
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:01 AM
గిరిజనుల భూములను పరిరక్షించాలని అధికారులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశించారు. శనివారం పాత పట్నం క్యాంపుకార్యాలయంలో సవరసిద్దమణుగు పరిధిలో భూములను తప్పుడుపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకొని అన్యాయం చేస్తున్నారని గిరిజనులు ఇచ్చిన ఫిర్యాదుపై రెవెన్యూ, గిరిజన సంఘ నాయ కులు, పోలీస్, గిరిజనులతో సమీక్షించారు.
పాతపట్నం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): గిరిజనుల భూములను పరిరక్షించాలని అధికారులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశించారు. శనివారం పాత పట్నం క్యాంపుకార్యాలయంలో సవరసిద్దమణుగు పరిధిలో భూములను తప్పుడుపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించుకొని అన్యాయం చేస్తున్నారని గిరిజనులు ఇచ్చిన ఫిర్యాదుపై రెవెన్యూ, గిరిజన సంఘ నాయ కులు, పోలీస్, గిరిజనులతో సమీక్షించారు. కార్యక్ర మంలో తహసీల్దార్ నందిగామ ప్రసాదరావు, గిరిజన నాయకులు వాబ యోగి, సింహాచలం పాల్గొన్నారు. కాగా సవరసిద్దమణుగు, బైదలాపురం, గొట్టిపల్లి గిరి జన ఆశ్రమపాఠశాలలను రేషనలైజేషన్ వేటుపడకుం డా పరిరక్షించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గిరిజన సంఘనాయకులు క్యాంపుకార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే కళలను పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. పాతపట్నంలో దివంగత డీవీ సుబ్బారావు కళాకారుల సంక్షేమసంఘం ప్రఽథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ మేరకు పద్మశ్రీ యడ్ల గోపాలరావును ఎమ్మెల్యే సన్మానించారు కార్యక్రమంలో కళాకారుల సంక్షేమసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్ట ఆంజనేయులు, హరిబాబు పెద్లింటి మోహన్‌దాస్, ఎస్. మదుబాబు పాల్గొన్నారు.