గ్రోయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:28 AM
ఎచ్చెర్ల మండలంలోని నాగావళి నది ఒడ్డున ఉన్న పొన్నాడ, తెప్పరేవు గ్రామాల పరిధిలో నది కోతను నివారించేందుకు గ్రోయిన్ల నిర్మా ణానికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ఎచ్చెర్ల, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలంలోని నాగావళి నది ఒడ్డున ఉన్న పొన్నాడ, తెప్పరేవు గ్రామాల పరిధిలో నది కోతను నివారించేందుకు గ్రోయిన్ల నిర్మా ణానికి అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పొన్నాడ, తెప్పరేవు పరిధిలో నది కోతను నివారించేందుకు గ్రోయిన్లు మంజూరుచేయాలని నారాయణపురం ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు ఇటీవల కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించిన విషయం విదితమే. ఈ నేప థ్యంలో ఇరిగేషన్ ఏఈఈ యశ్వంత్ సిబ్బందితో కలిసి పొన్నాడలోని దివంగత పంచి రెడ్డి నీలయ్య, అల్లు తులసీరావు పొలాల వద్ద, తెప్పరేవులోని సాదు అప్పారావు పొలం సమీపంలోని ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. గతంలో నాగావళి నది వరద కట్టల బలోపేతానికి రూ.372.60 కోట్లతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపగా, ఆ ప్రక్రియ ఆలస్యం కావడంతో పొన్నాడ గ్రామ తక్షణ రక్షణ నిమిత్తం మూడు గ్రోయిన్ల నిర్మాణానికి రూ.1.21 కోట్లతో ప్రత్యేక అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తు న్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు స్పష్టంచేశారు.