Share News

వీడీ నగర్‌ కాలనీ పాఠశాలలో కొత్త భవనానికి ప్రతిపాదనలు

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:03 AM

Response to the ‘Aksharam Andaga... Parishkarame Agenda-ga’ program నరసన్నపేటలోని వంశధార(వీడీ) నగర్‌ కాలనీలో ప్రాథమిక పాఠశాలను సమగ్ర శిక్షాభియాన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ పాఠశాల శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

వీడీ నగర్‌ కాలనీ పాఠశాలలో కొత్త భవనానికి ప్రతిపాదనలు
వంశధార నగర్‌లో ప్రాథమిక పాఠశాలను పరిశీలిస్తున్న ఈఈ డీవీఎన్‌ మూర్తి, ఎంఈవో దాలినాయుడు

ఈఈ డీవీఎన్‌ మూర్తి

‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి స్పందన

నరసన్నపేట, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలోని వంశధార(వీడీ) నగర్‌ కాలనీలో ప్రాథమిక పాఠశాలను సమగ్ర శిక్షాభియాన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు శనివారం పరిశీలించారు. ఈ పాఠశాల శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది మార్చి 15న ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో స్థానికులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఈ పాఠశాలను పరిశీలించి.. స్థితిగతులను విద్యాశాఖకు నివేదించారు. దీంతో ప్రభుత్వం స్పందించి సమగ్రశిక్షాభియాన్‌ ఈఈ డీవీఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌, విద్యాశాఖ అధికారులు శనివారం ఈ పాఠశాల భవనాలను పరిశీలించారు. పాఠశాలలో రెండు గదులు శ్లాబ్‌ పూర్తిగా పాడైందని గుర్తించారు. వర్షాకాలంలో ఇతర ప్రాంతాల్లో తరగతులను నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కొత్తభవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సమగ్రశిక్షకు అందజేస్తామని ఈఈ డీవీఎన్‌ మూర్తి తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో పి.దాలినాయుడు, హెచ్‌ఎం రజని పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:03 AM