‘ఎత్తిపోతల పథకం విస్తరణకు రూ.4.28 కోట్లతో ప్రతిపాదన’
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:04 AM
మదన గోపాల సాగరం ఎత్తిపోతల పథకం ఆయకట్టు విస్తరణ పనులకు రూ.4.28 కోట్లు అవపరమని తెలుపుతూ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడి దృష్టికి తీసు కువెళ్లినట్టు రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎస్‌ఈ కేవీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
టెక్కలి రూరల్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మదన గోపాల సాగరం ఎత్తిపోతల పథకం ఆయకట్టు విస్తరణ పనులకు రూ.4.28 కోట్లు అవపరమని తెలుపుతూ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడి దృష్టికి తీసు కువెళ్లినట్టు రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎస్‌ఈ కేవీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. టెక్కలి ప్రాంతలో గల వంశధార కాలువపై మదనగోపాల సాగరం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టి, ఇప్పటికే గత ఎడేళ్లుగా 3,300 ఎకరాలు సాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు మరో 2,500 ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు చేసినట్టు తెలిపారు. మంత్రి సానుకూలత వ్యక్తం చేయడంపై ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మినీజెట్టీ నిర్మాణం చేపట్టండి
మంత్రి అచ్చెన్నను కోరిన మంచినీళ్లపేట గ్రామస్థులు
వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): మంచినీళ్లపేట తీరం వద్ద మినీ జెట్టీ నిర్మాణం చేపట్టాలని కోరుతూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఆ గ్రా మస్థులు కోరారు. బుధవారం అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడును ఎమ్మె ల్యే గౌతు శిరీష్‌తో కలిసి వినతి పత్రం అందించారు. ఐదు వేల జనాభా కలిగిన వంచినీళ్లపేట గ్రామంలో 100 ఇంజన్లు, 100 కట్ల తెప్పలతో జీవనం సాగిస్తున్నా మన్నారు. అయితే ఫిషింగ్ జెట్టీ లేకపోవడంతో తుఫాన్ సమయంలో ప్రాణన ష్టం, ఆస్తి నష్టం జరుగుతుందన్నారు. తుఫాన్ల సమయంలో వలలు, ఇంజన్లు, బోట్లు ధ్వంసమై లక్షలాది రూపాయలు నష్టపోతున్నామన్నారు. దీంతో ఏటా మత్స్యకారులు వలసబాట పడుతున్నారన్నారని, అక్కడ కూడా ప్రమదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ గుల్ల చిన్నయ్య, గ్రామపెద్దలు ఉన్నారు.