Share News

అమ్మవారి పండగకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:09 AM

శ్రీకాకుళం నగరం అరసవెల్లిలో జరగనున్న అమ్మవారి పండగ ఏర్పాట్లు పక్కాగా చేపట్టా లని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆదేశించారు.

అమ్మవారి పండగకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
అరసవెల్లిలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ పుండ్కర్‌

కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

శ్రీకాకుళం/అరసవిల్లి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరం అరసవెల్లిలో జరగనున్న అమ్మవారి పండగ ఏర్పాట్లు పక్కాగా చేపట్టా లని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి అరసవల్లిలో సోమవారం పర్యటించారు. ఏర్పాట్లను స్యయంగా పరిశీలించి ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలిచ్చారు. అరసవెల్లి వెలమ వీధిలో రూ.20 లక్షల ఎంపీ లాడ్స్‌తో నిర్మించిన కళావేదికను పరిశీలిం చారు. రూ.80 లక్షలతో నిర్మిస్తున్న కాంపౌండ్‌ గోడ నిర్మాణాన్ని, రూ.15 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:09 AM