Share News

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించండి

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:37 AM

కూట మి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా ప్రభుత్వ అసుపత్రిలో గర్భి ణులకు సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చూ డాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైద్యులను ఆదేశించారు.

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించండి
ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • వైద్యులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా ప్రభుత్వ అసుపత్రిలో గర్భి ణులకు సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చూ డాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైద్యులను ఆదేశించారు. శుక్రవా రం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వార్డులు, మందుల నిల్వగది, రోగుల నమోదు రికార్డులను పరిశీలించారు. వైద్య పరికరాల పనితీరు అడిగి తె లుసుకున్నారు. వార్డులో రోగులతో మాట్లాడి అం దుతున్న వైద్య సేవలు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అన్ని వేళలా సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం నూతనంగా రూ.2.10 కోట్లతో నిర్మాణం జరుగుతున్న ఆ సుపత్రి అదనపు గదులను ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూ ర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షు డు కింజరాపు హరివర ప్రసాద్‌, టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ వెలమల విజయలక్ష్మి, టీడీపీ నాయకులు వెలమల కామేశ్వరరావు, కోరాడ పెద్ద గోవింద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:37 AM