మహిళాభివృద్ధితోనే ప్రగతి
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:18 AM
మహిళాభి వృద్ధితో దేశ ప్రగతి సాధ్యమని, మహిళా సాధికారతకు వివి ధ పథకాల అమలులో రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో నిలి చిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
మహిళా సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే శంకర్
జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహిళా దినోత్సవం
శ్రీకాకుళం/అరసవల్లి, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మహిళాభి వృద్ధితో దేశ ప్రగతి సాధ్యమని, మహిళా సాధికారతకు వివి ధ పథకాల అమలులో రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో నిలి చిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. అంతర్జా తీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం నగరంలోని ఎన్టీఆర్ మునిసిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజాభి వృద్ధిలో మహిళల పాత్ర వెలకట్ట లేనిదన్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడు తూ.. జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తు న్నామని, మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గు ముఖం పట్టాయన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర మహిళల్లో కష్టపడే తత్వం, ఆత్మాభిమానం, ఓ ర్పు ఎంతో ప్రత్యేకమైన వన్నారు. సీఎం చంద్రబాబు నాయ కత్వంలో మహిళా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఎస్‌హెచ్ జీలకు సుమారు 2.61 కోట్ల రుణాల చెక్కును లబ్ధిదారులకు అందించారు. అలాగే వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను సత్కరించారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకు న్నాయి. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, ఎల్డీఎం శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షు రాలు గంగమ్మ, ఐసీడీఎస్ పీడీ రూపవతి, టీడీపీ నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి, కూటమి పార్టీల మహిళా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
మహిళా సాధికారితతో అభివృద్ధి: రవికుమార్
ఆమదాలవలస, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారితతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. వివిధ రంగాల మహిళల పాత్రలను చిన్నా రులు వేసిన వేషధారణలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదల వలస రమేష్, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మునిసిపల్ మాజీ చైర్‌పర్స న్ తమ్మినేని గీత తదితరులు పాల్గొన్నారు.
మహిళలు దేశానికే ఆదర్శం: అశోక్
ఇచ్ఛాపురం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలు మహా రాణులని, వారు దేశానికి ఆదర్శమని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే బెందాళం అశోక్ అన్నారు. ఆదివారం మెప్మా ఆధ్వర్యంలో ఆర్‌జే ఫంక్షన్ హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం పలువురు మహిళలను సత్కరిం చారు. మహిళా సంఘాలకు మంజూరు చేసిన చెక్కును అందించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వేణుగోపాల్, మునిసిపల్ కమిషనర్ ఎన్.రమేష్, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ కొండా శంకర్ రెడ్డి, తహసీల్దార్ ఎన్.వెంకటరావు, ఏపీఎం ఎస్.ప్రసాద్, టీడీపీ నేతలు పత్రి తవిటయ్య, లీలారాణి, నందికి జాని, కూటమి నేతలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలే ప్రగతిరఽథ సారఽథులు: ఎంజీఆర్
పాతపట్నం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): మహిళలు ప్రగతి రథ సారథులని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక పెట్రోల్‌బంక్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న తన నూతనగృహ ఆవరణలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం ఆదివారం నిర్వహించారు. విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. కార్యక్రమం లో ఎంపీడీవోలు, తహసీలార్లు, మహిళలు పాల్గొన్నారు.
మహిళల పాత్ర కీలకం: బగ్గు
నరసన్నపేట, మార్చి 8(ఆంధ్రజ్యోతి): సమాజంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహిం చారు. మహిళా పారిశుధ్య కార్మికులను, మహిళ పోలీసులకు, మహిళ అధికారులకు సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, కాళింగ, పొందర కురాకుల కార్పొరేషన్లు చైర్మన్లు రోణంకి కృష్ణంనాయుడు, దామోదరం నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్లు ఇసా అప్పారావు, బైరి భాస్కరరావు, జలుమూరు జడ్పీటీసీ మెండ విజయశాంతి, వంశధార డీసీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్, తెలుగునాడు జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహార్ష తదితరులు పాల్గొన్నారు.