రోడ్ల అభివృద్ధితోనే గ్రామాల్లో ప్రగతి: శంకర్
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:58 PM
గ్రామాల్లో రహదారుల నిర్మాణంతో మరిం త ప్రగతి సాధిస్తాయని ఎమ్మె ల్యే గొండు శంకర్ అన్నారు.
గార, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో రహదారుల నిర్మాణంతో మరిం త ప్రగతి సాధిస్తాయని ఎమ్మె ల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం తాళ్లవలస లో రూ.35 లక్షలు, ఆరంగిపేటలో రూ.53 లక్షలతో చేప ట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామా ల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ కేసీహెచ్ మహంతి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 14 (ఆంధ్ర జ్యోతి): నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటు న్నామని ఎమ్మె ల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు బుధ వారం నగరంతో పాటు మండల పరిధిలో పలు గ్రామా ల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం భోత్సవాలు చేశారు. సీఎస్పీ నుంచి వాకలవలస మీదుగా లింగాలవలస వరకు, బలగ పరిధిలోని రామకృష్ణాపురానికి ఆర్అండ్ బీ రోడ్డు నుంచి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని ఇందిరానగర్ ఎక్స్టెన్షన్ రోడ్డులో, దమ్మల వీధిలో నిర్మించిన సీసీ రోడ్ల ను ప్రారంభించారు. నగర పాలక సంస్థ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.