Share News

అద్దె భవనాలతో అగచాట్లు

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:41 PM

పాత పట్నంలో పలుప్రభుత్వ శాఖలు అద్దెభవనాల్లో కొన సాగుతున్నాయి. ప్రతి నెలా వేలాది రూపాయలు చెల్లి స్తుండడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఎక్సైజ్‌తోపాటు ఐసీడీఎస్‌ తదితర కీలక శాఖలు అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడంతో సిబ్బందితోపాటు పనులకు వచ్చే వారు అవస్థలకు గురవుతున్నారు.

అద్దె భవనాలతో అగచాట్లు
అద్దెభవనంలో నిర్వహిస్తున్న ఎక్సైజ్‌శాఖ కార్యాలయం :

పాతపట్నం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): పాత పట్నంలో పలుప్రభుత్వ శాఖలు అద్దెభవనాల్లో కొన సాగుతున్నాయి. ప్రతి నెలా వేలాది రూపాయలు చెల్లి స్తుండడంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఎక్సైజ్‌తోపాటు ఐసీడీఎస్‌ తదితర కీలక శాఖలు అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడంతో సిబ్బందితోపాటు పనులకు వచ్చే వారు అవస్థలకు గురవుతున్నారు.

ఇదీ పరిస్థితి

పాతపట్నంలోని కోర్టుఆవరణలో భవన సముదా యాల్లో గతంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేవి. ఇక్కడఆదర్శంగా తీసుకొని జిల్లాలో పలుచోట్ల ఇలాగే నిర్మించాలని అప్పట్లో అధికారులు ప్రతిపా దనలు పంపేవారు. అయితే కోర్టు ఆవరణలో భవన సముదాయాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. ఈనేపథ్యంలో ఆ భవన సము దాయంలో ఉండే పోలీస్‌స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాల యం సొంత భవనాలు సమకూర్చుకున్నాయి. స్థానిక తెంబూరురోడ్‌లో ప్రహరాజపాలెం సమీపంలో మేడపై ఎక్సైజ్‌శాఖకార్యాలయంఅద్దెభవనంలో కొనసాగుతోంది. వృద్ధులు,సిబ్బంది మేడపైకి వెళ్లడానికి ఇబ్బందిపడు తున్నారు. అలాగే ఎక్సైజ్‌సిబ్బంది సీజ్‌చేసిన వాహనా లను కార్యాలయంఆవరణలో ఆరుబయట విడిచిపెడు తుండడంతో పాడవుతున్నాయి. అలాగే స్థానిక శివశం కర్‌ కాలనీలో అద్దెభవనంలో నిర్వహిస్తున్న ఐసీడీఎస్‌ కార్యాలయం ఇరుగ్గాఉండడంతో అంగన్‌వాడీ సిబ్బం ది అవస్థలుపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారంతా అవస్థలకు పడుతున్నారు. ఈనేపథ్యం లో అధికారులు చొరవచూపికార్యాలయాలన్నీ ఒకేచోట నిర్వహించి అద్దె భవనాల సమస్య నుంచి గట్టేక్కించా లని పలువురు కోరుతున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 11:41 PM