‘ప్రజా దర్బార్’తో సమస్యల పరిష్కారం: శంకర్
ABN , Publish Date - May 30 , 2026 | 11:33 PM
నియోజకవర్గంలోని సమస్యల పరి ష్కారమే ధ్యే యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
అరసవల్లి, మే 30(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని సమస్యల పరి ష్కారమే ధ్యే యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక విశాఖ-ఎ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. అనంతరం సమస్యలపై సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ బలో పేతం, సభ్యత్వ నమోదు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.