Share News

సత్వరమే సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:27 AM

రెవెన్యూ సమస్యలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష తెలిపారు.

సత్వరమే సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న ఆర్డీవో సాయిప్రత్యూష

  • శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష

జలుమూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష తెలిపారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దారు రామారావుకు పలు సూచనలు చేశారు. మండలంలో ఎంపిక చేసిన అక్కురాడ, శ్రీమన్నారాయణపురం రెవెన్యూ గ్రామాల్లో గల రైతులు సమస్యలు తెలుసుకొని అర్జీలు స్వీకరించి సత్వరమే పరిష్కరించాలన్నారు. వీఆర్వోలను ప్రతీ ఇంటికి పంపించి రైతులకున్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి పనిచేయాలన్నారు. అక్కురాడ రెవెన్యూలో సమస్యలు పరిష్కరించడానికి 36 మంది వీఆర్వోలు, ఏడుగురు సూపర్‌వైజర్లను నియమించినట్టు తహసీల్దారు తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 12:27 AM