‘పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:03 AM
మునిసిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మి కులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించా లని ఆ సంఘం నాయకుడు కె.తారకేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఆమదాలవలస, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మి కులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించా లని ఆ సంఘం నాయకుడు కె.తారకేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మునిసిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం కార్మికులు పని చేస్తున్నా తగిన గుర్తింపు, సౌకర్యాలు అందడం లేదన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబ స భ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. అనం తరం మునిసిపల్ మేనేజర్‌కు వినతిపత్రం అం దించారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నేత లు శ్రీను, గోవింద, జనార్దనరావు, వాసు తదిత రులు పాల్గొన్నారు.
‘వేతనాలు పెంచాలి’
ఇచ్ఛాఫురం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ముని సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని మండల నాయకుడు రమేష్ పట్నాయక్ అన్నారు. సోమ వారం మస్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలి పారు. 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, 17 రోజుల సమ్మె కాలం ఒప్పందాలకు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. కార్మికుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెని ఫిట్స్, గ్రాట్యుటీ, మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. హెల్ ్తకార్డులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.