సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:59 PM
Teachers protest at the Collectorate సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు గళమెత్తారు. మంగళవారం శ్రీకాకుళంలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల నిరసన
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూలై 14(ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయులు గళమెత్తారు. మంగళవారం శ్రీకాకుళంలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఫ్యాప్టో సంఘ చైర్మన్ బమ్మిడి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ‘12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలి. 30 శాతం మద్యంతర భృతిని ప్రకటించాలి. ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు నిర్వహించే ప్రత్యేక టెట్‌లో ఉత్తీర్ణత మార్కులు ఒకే విధంగా ఉండాలి. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి. సీపీఎస్ విధానం రద్దు చేయాల’ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో సంఘ నాయకులు ప్రతాప్‌కుమార్, టి.ప్రభాకరరావు, పి.వెంకటేశ్వర్లు, ఎల్.బాబురావు, బి.జగన్మోహన్‌రావు, డి.హరిప్రసన్న, పి.తిరుమలరావు, సీహెచ్ దిలీప్, డి.సరస్వతి, రవీంద్ర, భానుమూర్తి పాల్గొన్నారు.