ఐక్య ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:51 PM
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమని ఏపీజేఏసీ అమ రావతి జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు అన్నారు.
ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ రాజు
అరసవల్లి, సెప్టెంబరు 2(ఆంధ్ర జ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమని ఏపీజేఏసీ అమ రావతి జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు అన్నారు. ఈ మేరకు సీఐటీయూ కార్యాలయంలో బుధవారం సీఐటీయూ, ఏఐటీ యూసీ నాయకులతో కలిసి ఉద్యమ కరపత్రం ఆవిష్క రించారు. ఈ ఉద్యమానికి సీఐటీయూ, ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ప్రకటించా యన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, అల్లు సత్యనారాయణ, టి.తిరుపతిరావు తదిత రులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని పలు వార్డు సచి వాలయాలను సందర్శించి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగుల సంఘ నాయకులు టి.నాగరాజు, డి.శ్రీధర్, బి.పద్మప్రియ, సచి వాలయాల సంఘ నాయకులు గోవిందరావు, పాణి గ్రాహి, సత్యనారాయణ పాల్గొన్నారు.