ప్రైవేటీకరణను విరమించుకోవాలి
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:19 AM
మునిసిపల్ సేవల ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ మునిసిపల్ వర్క ర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బలరాం, నగర అధ్యక్షుడు అరుగుల గణేష్ డిమాండ్ చేశారు.
మునిసిపల్ కార్మిక సంఘం డిమాండ్
శ్రీకాకుళం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ సేవల ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ మునిసిపల్ వర్క ర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బలరాం, నగర అధ్యక్షుడు అరుగుల గణేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యా లయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేవల ప్రైవేటీ కరణ వల్ల ఇటు ప్రజలతో పాటు అటు కార్మికులు ఇబ్బందులుపడతా రన్నారు. మునిసిపల్ శాఖలో 14 కీలక విభాగాల సేవలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్ప గించడం ఉద్యోగులు, కార్మికుల భద్రతకు ప్రమాదకర మని ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల ప్రజలపై యూజర్ చార్జీల భారం పడుతుం దన్నారు. ప్రభుత్వం మునిసిపల్ కార్మికుల బాగోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణం ఈ నిర్ణ యాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు జ్యోతి ప్రసాద్, రాఘవ, ధనాల చిట్టి, ఆర్.యుగంధర్, మాధవి, పార్వతి, సరోజ, గంగ తదితరులు పాల్గొన్నారు.