‘రిజిస్ర్టేషన్ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం తగదు’
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:17 AM
రిజిస్ర్టేషన్ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం తగదని ఆమదాలవలస దస్తావేజు రైటర్ల అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఈ మేర కు రెండోరోజు మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు.
ఆమదాలవలస, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రిజిస్ర్టేషన్ శాఖలో ప్రైవేటు భాగస్వామ్యం తగదని ఆమదాలవలస దస్తావేజు రైటర్ల అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఈ మేర కు రెండోరోజు మంగళవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. జీవో 362ను తక్షణం ఉపసంహ రించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో సంఘం అధ్యక్షుడు ఎం.వేణుగోపాలరావు, ప్రతినిధులు ఎస్.రాజు, బి.శ్రీనివాసరావు, సీహెచ్ లక్ష్మణరావు, నానుపాత్రుని సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పొందూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సర్వీసు కేంద్రాల ఏర్పా టుకు గాను తీసుకువచ్చిన 396 జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్ రెండోరోజూ మంగళవారం కొనసాగింది. కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పైడి రామప్రసాద్, బలివాడ సత్యనారాయణ, కె.ప్రసాద్, మురళి తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛాఫురం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రిజిస్ర్ట్రేషన్ కార్యాలయాల్లో సేవా కేంద్రా ల ఏర్పాటును నిరసిస్తూ డాక్యుమెంట్ రైటర్లు రెండో రోజు మంగళవారం పెన్ డౌన్ చేసి నిరసన తెలిపారు. 396 జీవోను తక్షణం ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్యు మెంట్ రైటర్లు సోమేష్, రాజు, మోహన్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు
టెక్కలి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన 396జీవో రద్దు చేయాలని కోరుతూ స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు రెండో రోజైన మంగళవారం పెన్‌డౌన్ కొన సాగించారు. కార్యక్ర మంలో సంఘ అధ్యక్షుడు యలమంచిలి రామారావు, శాసనపురి లవకుమార్, శివ, సింహా చలం, నాని, మోహనరావు, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖరుల సంఘం డిమాండ్ చేసింది. ఈ జీవోకు నిరసన గా మంగళవారం రెండో రోజు కూడా పెన్‌డౌన్ కొనసాగించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు బోయిన శ్రీను, ఆర్.సూర్యనారాయణ, ఎన్. కాంతారావు, ఆర్.కోదండరావు, గోవింద్ పట్నాయక్, దుర్యోధన పాత్రో తదితరులు పాల్గొన్నారు.
హిరమండలం, జూలై7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం జారీ చేసిన జీవో 396ను రద్దు చేయా లని కోరుతూ హిరమండలం సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు మంగళవారం రెండో రోజు నిరసన తెలిపారు. పీపీపీ విధా నాన్ని నిరసిస్తూ పెన్‌డౌన్ చేశారు. కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు శ్రీనివాస పట్నాయక్, వంశీ తదితరులు పాల్గొన్నారు.