Share News

ఖైదీలు క్రమశిక్షణతో మెలగాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:01 AM

: జైలులో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తన, క్రమ శిక్షణతో మెల గాలని జిల్లా న్యాయ సేవాఽధికారి సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.

ఖైదీలు క్రమశిక్షణతో మెలగాలి
మాట్లాడుతున్న న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హరిబాబు

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు

శ్రీకాకుళం లీగల్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): జైలులో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తన, క్రమ శిక్షణతో మెల గాలని జిల్లా న్యాయ సేవాఽధికారి సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. సోమవారం గార మండలం అంపోలు లోని జిల్లా జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం గా ఖైదీలకు అందిస్తున్న ఆహారం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశా లను పరిశీలించారు. ఖైదీలకు అవసరమైతే తగు న్యాయ సహాయాన్ని తమ సంస్థ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జైలర్‌ దివాకర్‌ నాయుడు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:01 AM