Share News

పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం: ఎంజీఆర్‌

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:13 PM

కూటమిప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం: ఎంజీఆర్‌
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు:

ఎల్‌.ఎన్‌.పేట, జనవరి 22(ఆంధ్రజ్యోతి): కూటమిప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. గురువారం ఎల్‌ఎన్‌పేట మండలంలోని యంబరాం, పెద్దకోట గ్రామాలకు చెందిన నలుగురికి పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో రూ.2,68,263ల విలువచేసే సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు వెలమల సుగుణ, ఎంపీటీసీ మోహనరావు, ఎ.పోలినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 11:13 PM