Share News

ప్రజావసరాలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:25 PM

గ్రామాల్లో ప్రజావస రాలను గుర్తించి వాటిని మెరుగుపర్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

ప్రజావసరాలకు ప్రాధాన్యం
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

కవిటి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజావస రాలను గుర్తించి వాటిని మెరుగుపర్చేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. జగతి గ్రామంలో ప్రభుత్వ హోమి యో ఆసుపత్రి భవన నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రజలకు మేలు చేకూ ర్చేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మణిచంద్రప్రకాష్‌, సర్పంచ్‌ వరప్రసాద్‌, పీఏ సీఎస్‌ చైర్మన్‌ బాసుదేవ్‌ ప్రదాన్‌, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి.చిన్న బాబు, టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావు, నేతలు పి. ప్రవీణ్‌, బి.రమేష్‌, బి.నారాయణమూర్తి పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ బాసట

కవిటి/కంచిలి/ఇచ్ఛాపురం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. మంగళవారం ఇచ్ఛా పురం, కంచిలి మండలాల్లోని పలువురు లబ్ధిదారులకు రామ య్యపుట్టుగలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు పైల పురుషోత్తంరెడ్డి, టీడీపీ నాయకులు మాదిన రామారావు, మద్దిల ఆనందరావు, పైల రామారావు, ఇచ్ఛాపురం నేతలు పత్రి తవిటయ్య, నంది గాం కోటి, కాళ్ల జయదేవ్‌, కౌన్సిలర్‌ ఆశి లీలారాణి తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:25 PM