Share News

పచ్చిరొట్ట ఎరువుకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:04 AM

పొలాల్లో భూసారం పెంపుదలకు ఖరీఫ్‌లో పచ్చిరొట్ట ఎరువు, నవధాన్యాలు సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ అన్నారు.

పచ్చిరొట్ట ఎరువుకు ప్రాధాన్యం ఇవ్వాలి
మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ

జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ

ఎచ్చెర్ల రూరల్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): పొలాల్లో భూసారం పెంపుదలకు ఖరీఫ్‌లో పచ్చిరొట్ట ఎరువు, నవధాన్యాలు సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ అన్నారు. జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో కేశవరావుపేట రైతు సేవా కేంద్రంలో 30 మంది రైతులకు ప్రత్యేక శిక్షణ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులు వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. వరి, మొక్కజొన్న సాగుకు ముందు పచ్చిరొట్ట వేయడం వల్ల నేలసారం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆర్‌.శ్రీనివాసరావు, అనూష, సహాయ సంచాలకురాలు బగ్గు రజిని, ఏవో వావిలి పల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:04 AM