బాలల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:32 PM
రాష్ట్రంలో బాలల హక్కుల పరి రక్షణకు కమిషన్ ప్రాధాన్యం ఇస్తోందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు అన్నా రు. నగరంలోని ఎన్టీఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు.
కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు
శ్రీకాకుళం ఎడ్యుకేషన్/శ్రీకాకుళం కలెక్టరేట్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బాలల హక్కుల పరి రక్షణకు కమిషన్ ప్రాధాన్యం ఇస్తోందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు అన్నా రు. నగరంలోని ఎన్టీఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. పాఠ శాలలో మధ్యాహ్నభోజనం, బాలికలకు రక్షణ కల్పించే వివిధ అంశాలపై హెచ్‌ఎం, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యాబోధన, పాఠశాలలో సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే మావూరి వీధి అంగన్‌వాడీ కేంద్రం, డే నైట్ జంక్షన్ శ్రీకరి స్కానింగ్ సెంటర్, అరసవిల్లిలోని శిశుగృహ, ప్రభుత్వ మహిళా కళాశాల హాస్టల్, ఆర్‌బీ అతిథి గృహం వద్ద ఉన్న శాంతా కళ్యాణ్ అనురాగ నిలయాలను సందర్శించి చిన్నారులకు అందిస్తు న్న సేవలపై ఆరా తీశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే సమావేశా నికి సమగ్ర నివేదికలతో హాజరు కావాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు గంగా సూర్యనారాయణ, డా.పి.నాగమానస, డా.శ్రీనివాసమూర్తి, ఐసీడీఎస్ పీడీ ఎస్.సువర్ణ, బాలల రక్షణ అధికారి రమణ, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.