Share News

సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ABN , Publish Date - May 22 , 2026 | 11:57 PM

జిల్లా పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తు న్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమాన్ని చేపట్టి క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు.

 సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో సిబ్బంది సమస్యలు వింటున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

డయల్‌ యువర్‌ ఎస్పీలో వినతుల స్వీకరణ

శ్రీకాకుళం క్రైం, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్‌శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తు న్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమాన్ని చేపట్టి క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. దూర ప్రాంతాల నుంచి జిల్లా కార్యాయానికి వచ్చి సమస్య లపై అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా తనతో సమస్యలు తెలియజేయ వచ్చన్నారు. సిబ్బంది తమ వ్యక్తిగత, కుటుంబ, వృత్తి పరమైన సమస్యలను ఎటు వంటి సంకోచం లేకుండా నేరుగా తన దృష్టికి తీసుకు రావాలని సూ చించారు. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ నిర్వహిస్తు న్నామని దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల సిబ్బంది నుంచి సమస్యలను విన్న ఎస్పీ.. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు విభాగాల అధికారులకు ఆదేశించారు.

Updated Date - May 22 , 2026 | 11:57 PM