Share News

భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:57 PM

Development of Aravasalli at a cost of Rs 55.74 crore అరవసల్లిలో ఆదిత్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. సోమవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ఆదిత్యాలయాన్ని, పరిసరాలను, ఇంద్రపుష్కరిణి పనులను ఆయన పరిశీలించారు.

భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యం
మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..

ఆదిత్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతాం

రూ.55.74కోట్లతో పూర్తిస్థాయి అభివృద్ధి

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

అరసవల్లి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): అరవసల్లిలో ఆదిత్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. సోమవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి ఆదిత్యాలయాన్ని, పరిసరాలను, ఇంద్రపుష్కరిణి పనులను ఆయన పరిశీలించారు. తొలుత ఆదిత్యుడ్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సంస్కృతీ సంప్రదాయల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘స్వదేశీ దర్శన్‌’ పథకం ద్వారా ఆదిత్యుడి ఆలయ అభివృద్ధికి రూ.55.74కోట్లు మంజూరయ్యాయి. రెండేళ్ల కృషి ఫలించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తులకు సకల సౌకర్యాలతో రెండేళ్లలో పనులను పూర్తిచేసి ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. రూ.4కోట్లతో చేపడుతున్న ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి పనులు త్వరలో పూర్తికానున్నాయి. అధికారులందరూ సమన్వయంతో మాస్టర్‌ప్లాన్‌ అమలుకు కృషి చేయాలి. ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాల’ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, జిల్లా పర్యాటకశాఖ అధికారి ఎన్‌.నారాయణరావు, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:57 PM