Share News

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:04 AM

రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు.

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్‌

పొందూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. స్థానిక సీహెచ్‌సీలో రూ.40 లక్షలతో చేప ట్టనున్న పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలతో వైద్య రంగం బలో పేతం కాగా మంత్రి నారా లోకేశ్‌ విద్యారంగం అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు సైతం ప్రశంసిస్తున్నా యన్నారు. వైసీపీ హ యాంలో నాడు-నేడు పేరుతో విద్య, వైద్యరంగం లో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న కొత్త ఆసుపత్రి భవ నాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తా మన్నారు. అనంతరం మండల పరిషత్‌ ఆవ రణలో పంచాయతీలకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేజర్‌ పంచా యతీ సర్పంచ్‌ ఆర్‌.లక్ష్మి, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు అన్నెపు రాము, పార్టీ నాయకులు సీపాన శ్రీరంగనాయకులు, బలగ శంకర భాస్కర్‌, బాడాన గిరి, కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో వాసుదేవరావు, ఈవో పి.జగదీష్‌ పాల్గొన్నారు.

ఆసుపత్రి నిర్వహణపై ఆగ్రహం

ఆసుపత్రి నిర్వహణపై ఎమ్మెల్యే రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగు మండలాల ప్రజలకు వైద్యసేవలు అందించే ఆసుపత్రిని ఇలాగేనా నిర్వహించేదంటూ వైద్యులు, సిబ్బంది ని ప్రశ్నించారు. ఆసుపత్రి నిర్వహణలో మార్పు లేకున్నా, ఫిర్యాదులు వచ్చినా సహించేది లేదంటూ హెచ్చరించారు.

Updated Date - Mar 03 , 2026 | 12:04 AM