మహిళా సాధికారతకు ప్రాధాన్యం
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:05 AM
మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇ స్తోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఆమదాలవల స ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. నగరం లో కోవే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పది రోజుల పాటు పౌష్టిక్ కుకింగ్ శిక్షణ, పోటీల ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది.
ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్
అరసవల్లి, జూలై 22(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇ స్తోందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఆమదాలవల స ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. నగరం లో కోవే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పది రోజుల పాటు పౌష్టిక్ కుకింగ్ శిక్షణ, పోటీల ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. శిక్షణ ద్వారా నేర్చు కున్న అంశాలను ఆచరణలో పెట్టి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలన్నా రు. పారి శ్రామికవేత్తలుగా ఎదగాలని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్ర మంలో కోవే ఇండియా జాతీయ అధ్యక్షురాలు రాధిక, గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్ జి. సంయుక్త, కోవే ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
‘ఐక్యతతో పార్టీ పటిష్ఠతకు కృషి’
ఆమదాలవలస, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నేతలు, కార్యకర్తలు ఐక్యతతో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అ న్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం లో బుధవారం నియోజకవర్గ యూనిట్ ఇన్ చార్జిలు, పార్టీ కన్వీనర్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణుల పనితీరుపై కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక గ్రామాల్లో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నా రు. ‘సర్’ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించి శతశాతం సరే పూర్తి చేయించాల న్నారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు కరోతు రామకృష్ణ, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్, టీడీపీ నాయకులు తమ్మినేని విద్యా సాగర్, చంద్రశేఖర్, సీతబాబు, మురళీధర్, రాం బాబు, బలగ శంకర్, రామ్మోహన్, ఉదయ్ కుమార్, రాంజీ తదితరులు పాల్గొన్నారు.