మహిళా సాధికారితకు ప్రాధాన్యం
ABN , Publish Date - May 29 , 2026 | 11:48 PM
మహిళలు సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకునే విధంగా టీడీపీ మార్గం చూపించిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, మే 29(ఆంధ్రజ్యోతి): మహిళలు సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకునే విధంగా టీడీపీ మార్గం చూపించిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా బిల్లు మహిళా సాధికారితకు చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు. మొదటి నుంచి టీడీపీ మహిళా సాధికారితకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ఎన్టీయార్ మహిళలకు సమాన ఆస్తిహక్కు కల్పించారని, దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో వారి ఆర్థిక, సామా జిక, రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. వైసీపీ పాలనలో మహిళలపై అవమానకర ధోరణి కొనసాగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు భద్రతపై భరోసా కలిగిందని తెలిపారు.
చట్టసభల్లో రిజర్వేషన్ గొప్ప నిర్ణయం
మహిళా సాధికారిత మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన తమ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని పలాస టీడీపీ మహిళా నేతలు తెలిపారు. శుక్రవారం పలాసలో మహిళా నేతలు టీడీపీ నాయకురాళ్లు వజ్జ గంగాభవాని, జోగ త్రివేణి, హనుమంతు చిలకమ్మ, కొత్త రాజేశ్వరి, సైని కవిత, సంధ్యారాణి విలేకరులతో మాట్లాడుతూ మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్లకు బలమైన పునాది వస్తే ప్రకటనలకు పరిమితం కాకుండా చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కేటాయించడం గొప్ప నిర్ణయమన్నారు. మహిళలు ఆర్ధిక, రాజకీయపరంగా ప్రధమంలో ఉంచేందుకు చేస్తున్న కృషికి తాము పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.