Share News

పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం

ABN , Publish Date - May 30 , 2026 | 11:42 PM

ఆర్ధిక స్థోమత లేక ఏ ఒక్క నిరుపేద కూడా వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం ఆహర్నిశలూ శ్రమిస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద సీఎం సహాయనిధి ద్వారా వైద్యఖర్చులకు బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు.

  పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం
నరసన్నపేట:సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తి :

నరసన్నపేట, మే 30(ఆంధ్రజ్యోతి): ఆర్ధిక స్థోమత లేక ఏ ఒక్క నిరుపేద కూడా వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం ఆహర్నిశలూ శ్రమిస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద సీఎం సహాయనిధి ద్వారా వైద్యఖర్చులకు బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన, పేదవర్గాల ఆరోగ్యభద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగానే సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా నియోజకవర్గంలో సుమారు రూ.మూడు కోట్లు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బగ్గు అర్చన, కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, కోమటి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జామి వెంకట్రావు, పీఎసీఎస్‌ అధ్యక్షులు ఇసా అప్పారావు, బైరి భాస్కరరావు, అడపా చంద్రశేఖర్‌, జల్లు చంద్రమౌళి, గొద్దు చిట్టిబాబు, రామారావు, పీస కృష్ణ, బగ్గు గోపి, కోరాడ రామచంద్రరావు,బలగ ప్రహార్ష, బలగ భారతి, పుచ్చల కల్పన పాల్గొన్నారు.

ఫ పోలాకి, మే 30(ఆంధ్రజ్యోతి): పోలాకి, గాతలవలస, దువ్వవలస, సంతలక్ష్మీపురం, కొల్లివలసలో సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం మంజూరుచేసిన ఆర్థిక సహాయ నిధి చెక్కులను శనివారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన బాధితుల ఇళ్లకు వెళ్లి అందచేశారు. ఆమె వెంట నాయకులు బైరి భాస్కరరావు, ఎంవీ నాయుడు, కరుకోల రమేష్‌బాబు ఉన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:43 PM