Share News

విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:45 PM

విద్యా రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. గురువారం ఇచ్ఛాపు రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చింతాడ శరత్‌బాబుతన సొంత నిధులు రూ.3.20 లక్షలు కేటాయించి నిర్మించిన కళాశాల ప్రధాన ద్వారం ప్రిన్సిపాల్‌ ఆఫీస్‌ను ప్రారంభించారు.

 విద్యా రంగ అభివృద్ధికి ప్రాధాన్యం
ఇచ్ఛాపురం: మాట్లాడుతున్న బెందాళం అశోక్‌

ఇచ్ఛాపురం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): విద్యా రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. గురువారం ఇచ్ఛాపు రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చింతాడ శరత్‌బాబుతన సొంత నిధులు రూ.3.20 లక్షలు కేటాయించి నిర్మించిన కళాశాల ప్రధాన ద్వారం ప్రిన్సిపాల్‌ ఆఫీస్‌ను ప్రారంభించారు. కాగా ఖాళీ స్థలాన్ని ప్రిన్సిపాల్‌ ఎమ్మెల్యేను చూపించి ఆ స్థలంలో భవన నిర్మాణానికి నిధులు కేటాయిం చాలని ప్రిన్సిపాల్‌ ఎమ్మెల్యేను కోరారు. భవన నిర్మాణానికి నిధులు కేటాయింపునకు కృషి చేస్తా నని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పదో తరగతిలో 590మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాలలో చేరిన విద్యార్థినికి ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో డీవీఈవో సురేష్‌కుమార్‌, బాలిక జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నవ్యశ్రీ మహంతి, ఎంఈవో సూర్యారావు, రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, టీడీపీ పట్టణాధ్యక్షుడు పత్రి తవిటయ్య, కాళ్ల దిలీప్‌, కాళ్ల ధర్మారావు, కాళ్ల జయదేవ్‌, రెయ్యి జానకిరావు, లీలారాణి, నందికి జాని, ఆశి ధర్మరాజు, కె.ధర్మరాజు, బి.కృష్ణయ్య, గిన్ని చినరాహుల్‌సాహు, రామారావు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయ విధానం అవలంబించాలి

కవిటి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తే రైతు లకు మేలు కలుగుతుందని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ తెలిపారు. గురువారం ప్రగడ పుట్టుగ సమీపంలో కిసాన్‌మేళాను నిర్వహించారు.ఈసందర్భంగా శాస్త్రవేత్తలు మదుకు మార్‌, ఉదయ్‌బాబు, భాగ్యలక్ష్మి, ఉద్యానవనశాస్త్రవేత్త నరసింహమూర్తి, లక్ష్మీనారాయణ రైతులు తమతోటలు, పొలాల్లో చేపట్టాల్సిన పంటలు, వాటి వల్ల కలిగే లాభాలను వివరించారు. ఆత్మప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్‌మేళాలో ఉద్యానవన శాఖ ఏడీ చంద్రశేఖర్‌, పశువైద్య ఏడీ ప్రతాప్‌చంద్ర, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 11:46 PM