Share News

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం: ఎస్పీ

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:25 PM

జిల్లా పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తు న్నామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు.

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం: ఎస్పీ
ఫోన్‌లో సిబ్బంది సమస్యలను తెలుసుకుంటున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జూలై 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తు న్నామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్ర వారం జిల్లా పోలీసు కార్యా లయం నుంచి ఆయన డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి నేరుగా సమ స్యలను విని వాటి పరిష్కారా నికి సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. సిబ్బంది తమ ఉద్యోగ సంబం ధిత సమస్యలు, సంక్షేమం అంశాలు, పరిపాలనా ఇబ్బందులు, వసతి, ఆరోగ్య సదుపాయాలు, విధి నిర్వహ ణలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా 63099 90800 నెంబర్‌ ద్వారా తన దృష్టికి తీసుకు రావచ్చన్నారు. సమస్యల పరిష్కారంతో పోలీస్‌ సిబ్బందిలో ఆత్మవిశ్వాసం కల్పించడం, సంక్షేమం మలు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:25 PM