Share News

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:24 AM

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం పోలీస్‌ వెల్ఫేర్‌ డే సందర్భంగా విశ్రాంత పోలీస్‌ ఉద్యోగులు, సర్వీసులో ఉండి మృతి చెందిన పోలీస్‌ సిబ్బంది కుటుం బ సభ్యులు, హోంగార్డు కుటుంబ సభ్యులతో సమావేశం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్రాంత పోలీస్‌ ఉద్యోగులు, విధి నిర్వహణలో మృతి చెందిన పోలీస్‌ సిబ్బంది కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటా మని, వారికి ప్రభుత్వం, పోలీస్‌శాఖ నుంచి అందాల్సిన రిటైర్‌మెంట్‌, డెత్‌ బెనిఫిట్స్‌ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తమకు రావాల్సిన పెన్షన్‌, ఇతర సదు పాయాలు, కారుణ్య నియామకాలు, పెండింగ్‌ బకాయి లను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. విధి నిర్వహణలో మృతి చెందిన పోలీస్‌ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. వ్యక్తిగతంగా లేదా శాఖాపరంగా ఏమైనా సమస్యలుంటే నేరుగా తన ను సంప్రదించాలని, అవసరమైతే తన 63099 90800 నెంబరుకు సమస్యలను తెలియజేయ వచ్చని ఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

‘ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు’

శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును స్వీకరించి నిర్లక్ష్యానికి తావు లేకుండా విచారణ చేపట్టి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజా ఫిర్యా దులు స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 63 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించి ఫిర్యాదుదారులతో స్వ యంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పోలీస్‌శాఖ ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 12:24 AM