మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:58 PM
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ సర్వతోముఖాభి వృద్ధికి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఆదివారం మునిసిపాలిటీలోని 26వ వార్డులో 15వ ఆర్థిక సంఘ నిధులు రూ. ఎనిమిది లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు ఆమె భూమి పూజ చేశారు.
పలాస, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ సర్వతోముఖాభి వృద్ధికి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఆదివారం మునిసిపాలిటీలోని 26వ వార్డులో 15వ ఆర్థిక సంఘ నిధులు రూ. ఎనిమిది లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కమిషనర్ ఇ.శ్రీనివాసులు అధ్యక్షతన జరి గిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, మల్లా శ్రీనివాస్, శాసనపురి మురళీకృష్ణ, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారా వు, ఎం.నరేంద్ర, టంకాల రవిశంకర్‌గుప్తా, గురిటి సూర్యనారాయణ, సప్ప నవీన్, బడ్డ నాగరాజు పాల్గొన్నారు.
రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు
వజ్రపుకొత్తూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్న అప్పలరాజు ఎన్ని నిధులు తెచ్చారో వెల్లడించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష సవాల్ విసిరారు. ఆదివారం పల్లిసారధి, గొల్లసారధి, చినడోకులపాడులో పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చినడోకులపాడులో జరిగిన సమావేశంలో శిరీష మాట్లాడుతూ రెండేళ్లలో రూ. 2 వేల కోట్లు నిధులు తెచ్చి అబివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. వైసీపీ ఐదేళ్లలో వంశధార నీటిని మండలానికి తీసుకురాలేకపోయారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన 20 రోజుల్లో వంశధార నీటిని మండలంలో శివారు భూములకు తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంఽథాలయ చైర్మన్ విఠల్, టీడీపీ మండలాధ్యక్షుడు సూరాడ మోహనరావు, పిఎసిఎస్ చైర్మన్ కణితి సురేష్, నాయకులు తామాడ విశ్వ నాధం, అంబటి రామకృష్ణ, రెయ్య గణపతిరావు, బి.శశిభూషన్ పాల్గొన్నారు.