అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం: అశోక్
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:00 AM
గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రభు త్వం ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామాల్లో శాశ్వత అభివృద్ధికి కూటమి అభ్యర్థు లను గెలిపించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు.
కంచిలి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రభు త్వం ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామాల్లో శాశ్వత అభివృద్ధికి కూటమి అభ్యర్థు లను గెలిపించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. ఎం ఎస్‌పల్లి పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పసనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంగళవారం చేప ట్టారు. యు.గెద్దలపాడులో రూ. 36 లక్షలు, మోడల్ స్కూల్ నుంచి ఏఎస్ పల్లి వరకు రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. త్వరలో ఇంటింటికీ కుళాయిలను ఏర్పాటు చేస్తా మన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు, టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు, నాయకులు బంగారు కురయ్య, జగదీష్ పట్నాయక్, సూర్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ ఎన్.రమేష్ కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఈలు మూర్తి, మురళీ మోహనరావు, ఏఈ మోహనరావు, పీఆర్ డీఈ అల్లు చంద్రునాయుడు, ఏఈఈ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.