ప్రధాని మోదీ పాలన ఆదర్శనీయం
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:55 PM
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలన ప్రపంచానికే ఆదర్శనీయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు
లావేరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాలన ప్రపంచానికే ఆదర్శనీయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. భారత ప్రధాని గా 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం స్థానిక చంద్రశేఖర్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అవినీతిలేని పాలనను అందించారని, నాటి కాంగ్రెస్ పాలనలో అవినీతి పెచ్చిమీరి పోయిందన్నారు. మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అమలవుతున్నా యన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ మండల అధ్య క్షుడు ముప్పిడి సురేష్, ఏఎంసీ చైర్మన్ నిడిగంట్ల పద్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ ఐ.తోటయ్యదొర, పీఏసీఎస్ చైర్మన్ కె.దామోదరరావు, లంక నారాయణరావు, పిన్నింటి మధుబాబు, బాలబొమ్మ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. సుభద్రాపురం జంక్షన్‌లో స్వచ్ఛభారత్ నిర్వ హించారు. ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ రోడ్డును శుభ్రం చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ముప్పిడి సుజాత, ఎంపీడీవో పి.వెంకటరాజు, డిప్యూటీ ఎంపీడీవో పద్మజ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఇచ్ఛాఫురం, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రధానిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసు కున్న సంద ర్భంగా స్థానిక బీజేపీ నేతలు బుధవారం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవిశ్రాంతంగా 12 ఏళ్ల పాటు పాలన అందించిన ప్రధానిగా రికార్డు సృష్టించడం ఆనందకరమని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాలిన డిల్లీ, జిల్లా కోశాధి కారి వి.కృష్ణప్రసాద్, నేతలు భాస్కర్‌రెడ్డి, శ్రీను, ధనుష్‌రంగా తదితరులు పాల్గొన్నారు.