Share News

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన

ABN , Publish Date - Jun 17 , 2026 | 11:59 PM

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతోందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు.

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ పాలన
మాట్లాడుతున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

శ్రీకాకుళం లీగల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతోందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్‌) అన్నారు. బుధవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనతో విప్లవాత్మక మార్పులను చూడగలుగుతున్నామన్నారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజ న్‌ సర్కార్‌తో అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని, దీనికి ప్రధాని అనేక విధాలా సహకరిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో జగన్‌ సర్కార్‌ 10 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించినా కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటోందని చెప్పారు. భోగాపురం ఎయిర్‌ పోర్టు, గ్రీన్‌ హైడ్రా ప్రాజెక్టు, అనకాపల్లి స్టీల్‌ ప్లాంట్‌, ఎచ్చెర్ల నియోజక వర్గంలో రూ.440 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్‌ తదితర పనులే ఉదాహరణ అని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వర రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, చింతు పాపారావు, శవ్వాన ఉమామహేశ్వరి, చల్లా వెంకటే శ్వరరావు, అట్టాడ రవిబాబ్జి, బిర్లంగి ఉమామహేశ్వరరావు, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరి నరేంద్ర చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 11:59 PM